డిసెంబ‌ర్ నెల‌లో మ‌హేష్ మండే ట్రీట్ ఏంటో తెలుసా ?

ఈ కాలం నాటి ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ సినిమాలని సరికొత్త స్టైల్‌లో ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. చిన్న హీరో సినిమా అయినా, పెద్ద హీరో సినిమా అయిన ప్ర‌మోష‌న్ అవ‌స‌రం కాబ‌ట్టి మేక‌ర్స్ కొత్త ఒర‌వ‌డిని వెతుక్కుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సరిలేరు నీకెవ్వ‌రు చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో వేగాన్ని పెంచారు. డిసెంబ‌ర్‌ నెల‌లో ఉండే ఐదు సోమ‌వారాల‌లో ప్ర‌తి సోమవారం రోజు ఒక్కో సాంగ్ విడుద‌ల కానుంద‌ని, ఇది మ‌హేష్ త‌న అభిమానుల‌కి ఇచ్చే ట్రీట్ అని చిత్ర బృందం పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అంటే సంగీత ప్రియులు చెవుల కోసుకోవ‌ల్సిందే. ఈ సారి మ‌హేష్ సినిమా కోసం దేవి ఎలాంటి బాణీలు రెడీ చేశాడో చూడాలి. స‌రిలేరు నీకెవ్వరు చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య‌శాంతి ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నువిందు చేయ‌నుంది.