బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నటుడు రానా దగ్గుబాటి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా తెలుగులో విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
పీరియాడిక్ సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సాయాపల్లవి పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. రానా పాత్రపై పూర్తి క్లారిటీ రావడం లేదు. వైజాగ్‌కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట. ఈ చిత్రంలో 1990 నాటి రాజకీయ అంశలని దర్శకుడు ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రానా నక్సలైట్ గా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లు టాక్.